కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి..

17:57 - January 10, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఫిట్‌మెంట్‌ ఫార్ములా సమస్యను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామన్న కేంద్రం ఆరు నెలలైనా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం తీరుతో 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 34 లక్షల మంది పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన ధర్నాలో పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Don't Miss