విశాఖకు కొత్త హైవేలు

13:51 - August 13, 2017

విశాఖ : 23 వందల కోట్లతో నిర్మిస్తున్న అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారికి అనుబంధంగా మల్కన్ గిరి నుంచి బలిమెల, సీలేరు, చింతపల్లి, నర్సిపట్నం, చోడవరం మీదుగా సబ్బవరం వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే రాజమండ్రి-పాడేరు-విజయనగరం మీదుగా మరో రహదారిని విస్తరించనున్నారు. మొత్తం 724 కిలోమీటర్ల మేర... 4900 కోట్లతో..ఈ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నర్సీపట్నం... చోడవరం మీదుగా... 284 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసే రహదారికి 19 వందల కోట్లు ఖర్చువుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే రాజమండ్రి -పాడేరు- విజయనగరం మీదుగా 440 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి 3 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.

నాలుగు భారీ వంతెనలు...
నర్సీపట్నం-తుని మధ్య నాలుగు బైపాస్‌లు, నర్సీపట్నం-సబ్బవరం మధ్య ఏడు బైపాస్‌లు నిర్మించనున్నారు. 55 కిలోమీటర్ల మేర బైపాస్‌లు నిర్మాణం జరగబోతుంది. నాలుగు భారీ వంతెనల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఇందుకు మొత్తం 660 హెక్టార్ల భూములు అవసరమవుతాయని ప్రభుత్వం లెక్కలు వేసింది. బైపాస్‌ల కోసం 370 హెక్టార్ల భూములు... ఇక సబ్బవరం-నర్సీపట్నం మధ్య 210 హెక్టార్లు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ఎక్కువగా అటవీ భూములే సేకరించాల్సి ఉండడంతో రాష్ట్ర జాతీయ స్థాయిలో శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి సమీక్ష నిర్వహిస్తున్నారు.

మావోయిస్టుల ప్రాబల్యాన్ని అణచివేసేందుకే
అయితే గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం ఈ రెండు జాతీయ రహదారులను విస్తరిస్తున్నట్టు పాలకులు చెబుతున్నా... మావోయిస్టుల ప్రాబల్యాన్ని అణచివేసే ఉద్దేశంతో... రోడ్ల నిర్మాణం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.  

Don't Miss