సుప్రీంలో ఆధార్ అనుసంధానంపై విచారణ...

13:17 - December 7, 2017

ఢిల్లీ : ఆధార్ అనుసంధానంపై సుప్రీంలో విచారణ జరిగింది. మార్చి 31 వరకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఆధార్ అనుసంధానికి ఆఖరి గడువు డిసెంబర్ 31గా ఉన్న సంగతి తెలిసిందే. మొబైల్, బ్యాకింగ్ సేవలు..సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడంపై పలువురు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ వ్యక్తిగత వివరాలు బయటకు పొక్కే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. దీనిపై సుప్రీం గురువారం విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఆధార్ లేని వారికి మాత్రమే ఇది వర్తింప చేసే విధంగా చూస్తామన్నారు. మొబైల్ సేవలకు ఆధార్ అనుసంధానానికి ఆఖరి గడువు ఫిబ్రవరి 6గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

Don't Miss