మహిళ మెడలో చైన్ ఎలా కొట్టేసాడో చూడండి..

15:43 - July 27, 2018

శ్రీకాకుళం : చైన్ స్నాచింగ్ లు ప్రతీ ప్రాంతంలోను రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్డుపై ఒంటిరిగా వెళ్లే మహిళలను టార్గెట్ గా చేసుకుని ఇటువంటి అఘాయిత్యాలకు దొంగలు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో నే పలాస మున్సిపాలిటీ పరిధిలో నడిరోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ మహిళ మెడలోకి బంగారు గొలుసును దొంగ ఎత్తుకెళ్లటం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రోటరీ నగర్ లో ఉషారాణి అనే మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గొలుపును కాజేసిన దుండగుడు బైక్ పై పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్న ఓ మహిళను ఓ యువకుడు వెంబడించగా..మరో యువకుడు బైక్ తో రెడీగా కాపు కాసాడు. మహిళను వెంబడించి అదను చూసి గొలుసు కాజేసి రెడీగా వున్న బైక్ పై ఇద్దరు ఉడాయించారు. సీసీ పుటేజ్ లోని ఈ దృశ్యాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా దొంగను గుర్తించి, గాలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

Don't Miss