టిడిపి ఎంపీల స్ట్రాంగ్ వార్నింగ్..రాజకీయమేనా ?

16:30 - February 11, 2018

గుంటూరు : అమరావతిలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ ముగిసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, పార్లమెంటులో పరిణామాలపై చర్చించారు. అరుణ్‌జైట్లీ, అమిత్‌షాలతో టీడీపీ నేతల చర్చలు, అనంతర పరిణామాలపై ఎంపీలు బాబుకు వివరించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు విడుదల చేసిన 27 పేజీలపై నోట్‌పై ప్రధానంగా చర్చించిన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన వాస్తవ నిధులపై వివరణ, బీజేపీ నేతలకు మరోసారి స్ట్రాంగ్‌గా వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ ఎంపీలు.  

Don't Miss