బాబు ప్రాజెక్టుల సమీక్ష..

07:33 - April 17, 2018

అమరావతి : పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన వ్యయంలో కేంద్రం చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగిచ్చేలా కేంద్ర మంత్రులకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పోలవరం సహా 53 ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పోలవరంకు సంబంధించి 52 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. కుడి ప్రధాన కాలువ పనులు 89 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 58 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. లక్ష్యానికి మించి పోలవరం పనులు సాగుతుండడంతో సీఎం చంద్రబాబు అధికారులను అభినందించారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవీనేని ఉమామహేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు పలు శాఖల సెక్రటరీలు పాల్గొన్నారు. 

Don't Miss