కర్ణాటక పరిణామాలపై 'బాబు' మండిపాటు...

18:24 - May 17, 2018

ప్రకాశం : ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మండిపడ్డారు. కేంద్రంపై పలు విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా పోకూరులో నీరు - ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడారు...
కర్ణాటకలో బీజేపీ అనైతికంగా..అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. ఒక పార్టీకి మెజార్టీ ఇస్తే...రాజ్యాంగపరంగా ముందుకు పోవాలని, ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సి ఉంటుందన్నారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్..జేడీఎస్ లు రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే..గవర్నర్ ఆహ్వానించకుండా ఇతర పార్టీకి అవకాశం ఇవ్వడం సబబేనా ? ఆలోచించాలన్నారు. ఇదేనా నీతి ? అంటూ మండిపడ్డారు. అధికారం ఉందని బీజేపీ ఇష్టానుసారంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న బీజేపీ ప్రస్తుతం చేసింది ఏంటీ ? ఇది మంచి పద్ధతి కాదన్నారు. 

Don't Miss