పిచ్ పై మండుతున్న బొగ్గులు..

12:14 - December 15, 2016

పిచ్ పై బొగ్గులు మండడం ఏంటీ ? ఎవరైనా పిచ్ పై క్రికెట్ ఆడుతారు కానీ బొగ్గులకు మంటల పెట్టడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? పూర్తి వివరాలకు ఇది చదవండి..చెన్నై లో మొన్న వర్ధా తుపాన్ ఎంతటి బీభత్సం సృష్టించిందో తెలిసిందే కదా. బలమైన గాలులు వీచేసరికి కొన్ని కార్లు..బస్సులు బోల్తా కూడా పడ్డాయి. ఈ గాలికి కొంతమంది పడిపోయారు కూడా. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్ - భారత్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ఇక్కడ జరగాల్సి ఉంది. చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందా ? లేదా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వర్షం వల్ల పూర్తిగా తడిసిపోయిన పిచ్ ను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అక్కడి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పిచ్ ను ఆరబెట్టడానికి గ్రౌండ్ సిబ్బంది మండించిన బొగ్గులను దానిపై ఉంచుతున్నారు. పిచ్ ను ఆరబెడుతున్న ఫొటోలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. బుధవారం కూడా ఎండ రావడంతో పిచ్ ఆరుతుందని గ్రౌండ్ సిబ్బంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. డిసెంబర్ 16 నుండి 20వ తేదీన వరకు మ్యాచ్ జరగనుంది.

Don't Miss