భోగి మంటలు..విమానరాకపోకలపై ప్రభావం..

16:14 - January 13, 2018

చెన్నై : ఉదయం విమాన రాకపోకలపై భోగి మంటలు ప్రభావం చూపాయి. భోగి మంటల దెబ్బకు ఆకాశం దట్టమైన పొగతో నిండిపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తమిళనాడులో పొంగల్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉదయం ప్రారంభమైన భోగి మంటల్లో ఇంట్లోని చెత్త, చెదారం, కర్రలు తదితర వస్తువులు వేయడంతో దట్టమైన పొగ అలుముకుంది. చెన్నై వీధులు పొగతో నిండిపోయాయి. ఎదురుగా దాదాపు 50 మీటర్ల వరకు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కువైట్‌, షార్జా, ఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి రావలసిన 18 విమానాలను దారి మళ్లించి హైదరాబాద్‌, బెంగళూరుకు తరలించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Don't Miss