సన్ రైజర్స్ పై చెన్నై పై చేయి...

08:53 - May 23, 2018

ఢిల్లీ : చెన్నై సూపర్‌ కింగ్స్‌ సూపర్‌ విక్టరీ కొట్టింది. ఐపీఎల్‌ 11 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫస్ట్‌క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో దోనీగ్యాంగ్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ పరుగుల వేటలో తడబడ్డారు. నిర్దేశిత 20ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగారు. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై పైచేయి సాధించింది. దీంతో తొలి ఫైనల్‌ బెర్తును చెన్నై సూపర్ కింగ్స్ ఖరారు చేసుకుంది. చెన్నై ఆటగాడు డుప్లెసిస్‌ 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67పరులు చేసి చెన్నైని ఫైనల్‌కు చేర్చాడు. 

Don't Miss