ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

08:12 - May 1, 2018

మహారాష్ట్ర : పుణేమ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని సాధించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 13 పరుగుల తేడాతో ధోనీ గ్యాంగ్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో చివరి దాకా పోరాడినా  ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సొంతమైదానం పుణెలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చిచ్చురపిడుగులా చెలరేగిపోయింది. ప్రత్యర్థులకు ఓపెనర్లు ముచ్చెమటలు పట్టించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాట్స్‌మెన్లు దిల్లీ బౌలర్లకు ఊచకోత కోశారు. షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ 40 బంతుల్లో 4 ఫోర్లు,  7 సిక్స్‌లతో   78 పరుగులు చేయగా.. 33 బంతుల్లో 3ఫోర్లు, 1×సిక్స్‌ బాదిన డుప్లెసిస్‌  33 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్‌  ఎంఎస్‌ ధోనీ 22 బంతుల్లో నే 51 రన్స్‌ బాదగా, అంబటిరాయుడు 24 బంతుల్లో 41 పరుగులతో టాప్‌లేపాడు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో చెన్నై టీం 4వికెట్లు నష్టపోయి 211 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాళ్లు తడబడ్డారు. 20ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 198 మాత్రమే చేయగలిగారు. దీంతో చెన్నైటీం పాయింట్ల పట్టికలో మరోసారి టాప్‌ప్లేస్‌కు చేరుకుంది. 

 

Don't Miss