జడ్జీల పోస్టులు భర్తీ చేయాలి : ఠాకూర్

21:57 - November 26, 2016

ఢిల్లీ : దేశ‌వ్యాప్తంగా హైకోర్టులు, ట్రిబ్యున‌ళ్లలో ఉన్న ఖాళీల‌ను కేంద్రం భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి టీఎస్ ఠాకూర్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టులలో 500 వరకు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఠాకూర్ మండిపడ్డారు. ఈపాటికి పనిచేస్తూ ఉండాల్సిన 500 మంది జడ్జీలు పనిచేయడం లేదన్నారు. అసలు నియామకాలే జరగలేదని తాను అనట్లేదని.. ఇప్పటికి 120 మందిని మాత్రమే నియమించారని తెలిపారు. ట్రిబ్యునల్ చైర్మన్‌కు క‌ల్పించాల్సిన క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌డానికీ ప్రభుత్వం ముందుకు రాక‌పోవ‌డంతో చాలా మంది జ‌డ్జీలు ఆ ప‌ద‌వుల‌ను నిరాక‌రిస్తున్నారని ఠాకూర్ వెల్లడించారు. చీఫ్‌ జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. చీఫ్ జస్టిస్ అంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ జడ్జీల నియామకంలో మాత్రం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేమన్నారు. 

Don't Miss