బాలల దినోత్సవం రోజున నల్గొండలో విషాదం...

16:28 - November 14, 2017

నల్గొండ : బాలల దినోత్సవం రోజున పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో సంప్ లో పడి విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాల్వలో పడి విద్యార్థి మృతి చెందాడు. అక్కాలాయిగూడెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజయేందర్ చదువుకొంటున్నాడు. స్కూల్ లో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు బాలురకు సౌకర్యం లేదు. దీనితో మంగళవారం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు విజయేందర్ తోటి విద్యార్థి సైదులుతో కాల్వకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విజయేందర్ అందులో పడిపోయాడు. సైదులు ఓ చెట్టును పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Don't Miss