'చిరు'కి కట్ చెప్పనున్న కొరటాల?..

17:46 - June 4, 2018

సామాజికాంశాలను తన చిత్రాల ద్వారా చూపించే కొరటాల శివ ఇప్పుడు మెగాస్టార్ కి కట్ చెప్పనున్నాడా? సైరాతో బిజీగా వున్న మెగాస్టార్ కొరటాల శివతో కమిట్ అవ్వనున్నాడా? భరత్ అను నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు చిరంజీవి సై అన్నట్లుగా సమాచారం. రీ ఎంట్రీనిచ్చి ఖైదీనంబర్ 150తో మెగా హిట్ ను అందుకున్న చిరంజీవి ఒక వైపున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమాను చేస్తూనే, మరో వైపున కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కొరటాల వినిపించిన కథకి చిరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయం తెలిసిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండనుంది? చిరంజీవి పాత్ర తీరుతెన్నులు ఎలా వుండనున్నాయి? అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది.

ద్విపాత్రాభియంలో చిరంజీవి మరోసారి అలరించనున్నాడా?..
ఈ సినిమాలో బిలియనీర్ అయిన ఎన్నారై గాను .. ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రెండు పాత్రలను కూడా కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై వున్నాడని అంటున్నారు. కొరటాల వరుసగా ఘన విజయాలను అందుకుంటూ వస్తుండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందో చూడాలి.

 

Don't Miss