బావిలోదూకి ఇద్దరు బిడ్డలతో సహా గర్భిణి ఆత్మహత్య

12:17 - June 13, 2018

చిత్తూరు : జిల్లాలోని రూరల్‌ మండలం పెయనకండ్రిగలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు బిడ్డలతో సహా బావిలో దూకి గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. అత్తారింటి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు అంటున్నారు. మృతులు: సరళ(29), దేవిశ్రీ(2), జ్యోత్స్న(4)గా గుర్తించారు. భర్త గురునాథం పరారీలో ఉన్నాడు.

 

Don't Miss