పట్టా భూములు లాక్కొంటున్నారంటూ..

15:33 - February 12, 2018

కరీంనగర్ : జిల్లాలోని చొప్పదండి మండలం కేంద్రంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పట్టా భూములు లాక్కొని వేరే వారికి ఆ స్థలంలో డబుల్ బెడ్ రూం నివాసాలు కట్టించడానికి ఏర్పాటు చేస్తున్నారని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. ఇందులో ఎమ్మెల్యే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.

వైఎస్ హాయంలో చొప్పదండి మండల కేంద్రంలో 150 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద పట్టాలు ఇచ్చారు. కొంతమంది ఇళ్లు నిర్మించుకోగా మరికొంతమంది ఇళ్లు నిర్మించకపోవడంతో ఆ స్థలాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఖాళీ స్థలాలను గుర్తించి అందులో డబుల్ బెడ్ రూం నివాసాలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ లబ్దిదారులు ఎవరనున్నారో వారికి కాకుండా టీఆర్ఎస్ అనుచరులు..ఇతరులకు డబుల్ బెడ్ రూం నివాసాలు కట్టబెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Don't Miss