వేముల రోహిత్‌ దళితుడుకాదని నిర్ధారించడం దారుణం : చుక్కా రామయ్య

18:17 - February 17, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న మేముల రోహిత్‌ దళితుడు కాదంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఇవ్వడాన్ని మేధావులు తప్పుపడుతున్నారు. రోహిత ఎస్సీ అని ధృవీకరిస్తూ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన తర్వాత దళితుడుకాదని నిర్ధరించడం వెనుక  పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. కులవిక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుకార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే రోహిత్‌ను బీసీగా ప్రకటించారని వివిధ సంఘాల నేతలు విమర్శించారు. 

Don't Miss