నాకేమైన్నా వ్యసనం ఉందా ? బాబు ప్రశ్న...

17:22 - June 4, 2018

విజయనగరం : ఏపీ రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. అవినీతి పరులకు సహకరించే పరిస్థితులు వచ్చాయని, గాలి జనార్ధన్ రె డ్డి...జగన్ లకు సహకారం ఇచ్చింది బీజేపీ అని..అగ్రిగోల్డ్ విషయంలో పేదలకు న్యాయం జరిగేంతవరకు కృషి చేస్తానని తెలిపారు. ఎర్రచందనం దొంగల గుండెల్లో రైలు పరుగెత్తించానని..ఇసుకను ఉచితంగా తీసుకెళ్లాలనని చెప్పడం జరిగిందని..కానీ అవినీతి ఆరోపణలు చేస్తుండడం బాధేస్తుందన్నారు. పద్దతి ప్రకారం రాజకీయాలు నడిపి భావి తరాలకు మార్గదర్శకంగా నిలవాలని అనుకున్నట్లు తెలిపారు.

ప్రతిపక్షాలు తనను దూషించే పద్ధతిని గమనించాలని..ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం తప్పా ? అని ప్రశ్నించారు. ఏదో చేస్తారని ఆశించి మోస పోయామని, దేశం మొత్తం మోసపోయిందని పరోక్షంగా బీజేపీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఏటీఎం..బ్యాంకుల్లో డబ్బులు దొరకని పరిస్థితి నెలకొందని, పెట్రోల్..డీజిల్ ధరలు ఒక పైసా తగ్గించడం ఒక జోక్ అని అభివర్ణించారు.

వ్యవసాయం కుదేలు అయ్యిందని..ఉద్యోగాలు లేవని ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే జరిగిందన్నారు. రాష్ట్ర విభజన..కేంద్ర సహాయం లేకపోవడం..కేంద్ర పరిపాలనలో లోటుపాట్లు వల్ల ఏపీ నష్టపోయిందన్నారు. విజయనగరం జిల్లాను ఎంతో అభివృద్ధి సాధించాలని, ఇందుకు అన్ని విధాల సహకరిస్తానని బాబు చెప్పారు. 

Don't Miss