కోడిపందాలపై దాడులు షురూ..

18:56 - January 9, 2017

పశ్చిమ గోదావరి : ఆచంట మండలంలోని మంగలిపుంతలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీధి దాపాల వెలుగులో కోడి పందాలు నిర్వహిస్తుండగా 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కోడిపుంజులు, 9 బైకులు, 13 సెల్‌ఫోన్లు, 12 కత్తులతో టు నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. 

Don't Miss