నాణాల ఉత్పత్తి నిలిపివేత...

17:19 - January 11, 2018

ఢిల్లీ : నాణాల ఉత్పత్తి ఆపు చేయాలని టంకశాలలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీనితో కోల్ కతా, నోయిడా, ముంబై, హైదరాబాద్ లో ఉన్న ముద్రాణాలయాల్లో నాణాలను ముద్రించడం ఆపు చేయనున్నారు. మార్కెట్ లో నాణాలు చలామణి అధికంగా ఉండడం..కోశాగారాల్లో స్థలం సరిపోకపోవడంతో ముద్రణనను ఆర్బీఐ నిలిపివేసినట్లు సమాచారం. పాతనోట్ల రద్దుతో రూ. 5వందలు, రూ. వెయ్యి నోట్లతో కోశాగారాలు నిండిపోయాయి. నాణాలకు కొరత లేదని..సామాన్యులు ఆందోళన చెందవద్దని తెలిపారు. 24 నవంబర్ 2016 వరకు రూ. 1. రూ. 2, రూ. 5, రూ. 10 చెందిన నాణాలు రూ. 672 కోట్ల నిలువ ఉందని ఆర్బీఐ పేర్కొంది. కొన్ని బ్యాంకులు నాణాలు తీసుకోవడం లేదని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీనితో అన్ని బ్యాంకులు నాణాలు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి ఆర్థిక మంత్రి జైట్లీ సూచించారు. 

Don't Miss