కామ్రేడ్ మహ్మద్ అమీన్ ఇక లేరు...

21:14 - February 12, 2018

ఢిల్లీ : సిపిఎం సీనియర్‌ నేత, సిఐటియూ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మహ్మద్‌ అమీన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. ప్రస్తుతం సిపిఎం కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. అమీన్‌ మృతి పట్ల సిపిఎం సంతాపం వ్యక్తం చేసింది. అమీన్‌ అందించిన సేవలు కార్మిక వర్గ చైతన్యానికి ప్రతీకగా నిలిచాయని కొనియాడింది. కోల్‌కతాలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన మహ్మద్‌ అమీన్ 14 ఏళ్ల వయసులోనే జూట్‌ మిల్లులో పనిచేశారు. 1946లో ఆయన కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరిన ఆయన వివిధ పదవులు నిర్వహించారు. కార్మిక నేతగా సేవలందించిన అమీన్‌- పశ్చిమబెంగాల్‌ సిపిఎం ప్రభుత్వంలో రవాణా, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1988-94 మధ్య రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.

Don't Miss