డబ్బు లేకుండా బతకడం ఎలా ?

20:34 - December 13, 2016

పనిచేసే సత్తా ఉంది..దమ్ముంది..పని ఉంది. పనిచేస్తే చేతికి వచ్చే డబ్బుతోనే సమస్యలు అంతా. కార్మికులు రోజు మొత్తంగా పనిచేస్తే వచ్చేది రూ. 400 నుండి రూ. 500. కానీ ఈ నోటే ప్రస్తుతం కార్మికుడి పొట్ట కొడుతోంది. పనులు లేక ఉట్టిగా కూర్చుంటున్నరు. పెద్దనోట్ల రద్దు అనంతరం వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి తెలుసుకొనేందుకు ‘మల్లన్న’ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో గ్రానైట్ కార్మికుల బాధను బాహ్య ప్రపంచానికి తెలియచేశాడు. రోజు పనిచేస్తే రూ. 500 వస్తుంది..నెలకు రూ. 9-10 వేల వరకు ఇంటి ఖర్చు ఉంటుందని ఓ కార్మికుడు పేర్కొన్నాడు. రూ. 2వేల నోటుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, డబ్బులు లేకుంటే ఎలా బతకాలని వాపోయారు. ఏ కంపెనీలలో కూడా సంతోషంగా ఉన్నామని కార్మికుడు చెప్పలేదని 'మల్లన్న' తెలిపాడు. 50 రోజుల్లో మొత్తం మారుస్తామని చెప్పిన పాలకులు నెల రోజుల్లో ఎంత మార్పు వచ్చిందో ఆలోచించాలని అభిప్రాయం తెలిపారు. ఏబీసీడీలే రావు..ఆన్ లైన్ ట్రాన్స్ ఎలా చేస్తామని అక్కడి కార్మికులు పేర్కొన్నారు. కార్మికుల బాధలు..కష్టాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss