వైసీపీ నుంచి గౌతమురెడ్డి సస్పెన్ష్

21:39 - September 3, 2017

కృష్ణా : జయవాడలో వైసీపీ వర్గాలు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. వంగవీటి రంగాపై గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. దీనికి నిరసనగా రాధా అనుచరులు నిరసనకు దిగారు. రాధను అరెస్టు చేయడానికి పోలీసులు యత్నంచడంతో .. మాజీ ఎమ్మెల్యే రాధ తల్లి రత్నకుమారి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వంగవీటిఅభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వంగవీటి రత్నకుమారి కిందపడిపోయి గాయపడ్డారు. దీనిపై వంగవీటి రాధ ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లతామన్నా వినిపించుకోకుండా పోలీసులు అతిగా ప్రవర్తించారని రాధ మండిపడ్డారు. ప్రస్తుతం రాధను అదుపులోకి తీసుకున్న పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారు. మరోవైపు వివాదంపై వైసీపీ అధినేత జగన్‌ సీరియస్‌ అయ్యారు. గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. నిషేదం తక్షణం అమల్లోకి వస్తుందని జగన్‌ స్పష్టంచేశారు. వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని జగన్‌ ఆదేశించారు. 

Don't Miss