కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్య...ఉద్రిక్తత

22:16 - January 8, 2017

ఆదిలాబాద్‌ : జిల్లాలో కాంగ్రెస్‌ కార్యకర్త తిరుపతిరెడ్డి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తిరుపతి రెడ్డిని అధికార పార్టీ నేతలే హత్య చేయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై మృతదేహంతో కాంగ్రెస్‌ శ్రేణులు బైఠాయించి.. ఆందోళన చేశారు. అధికార పార్టీ వేధింపులు తాళలేక కాంగ్రెస్‌ కార్యకర్త తిరుపతిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి  హత్యే అని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. అట్రాసిటీ కేసు వేధింపులు భరించలేక జైనథ్ మండలం లక్ష్మిపూర్‌ గ్రామానికి చెందిన కాటిపెల్లి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా మంత్రి అండదండలతో, స్థానిక ఎంపీటీసీ అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తిరుపతిరెడ్డి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదుతో అటవీ శాఖ మంత్రి జోగురామన్న కుమారుడు జోగు ప్రేమేందర్‌ సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

Don't Miss