జెఎన్ యూలో ఎబివిపికి గట్టి ఎదురుదెబ్బ

21:56 - September 13, 2017

ఢిల్లీ : ఢిల్లీ యూనివ‌ర్సిటీ విద్యార్థుల సంఘం ఎన్నిక‌ల్లో బిజెపి అనుబంధ విద్యార్థి సంస్థ ఎబివిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్ష పదవిని గెలుచుకుంది. ఎన్‌ఎస్‌యుఐకి చెందిన రాకీ తూశీద్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్ష పదవిని కూడా ఎన్‌ఎస్‌యుఐ కైవసం చేసుకుంది. ఏబివిపి సెక్రెటరీ, జాయింట్‌ సెక్రెటరి పదవులు దక్కాయి. నాలుగేళ్ల తర్వాత ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్ష పదవిని గెలుచుకుంది. అధ్యక్ష పదవి కోసం ఎబివిపి నుంచి రజత్‌ చౌదరి, ఎన్‌ఎస్‌యుఐ నుంచి రాకీ తుశీద్, ఐసా నుంచి పారల్‌ చౌహాన్, స్వతంత్ర అభ్యర్థి రాజా చౌదరి పోటీ పడ్డారు.  సెప్టెంబ‌ర్ 12న జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 43 శాతం విద్యార్థులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఏడాది ఏబివిపి మూడు పదవులు గెలుచుకోగా ఎన్‌ఎస్‌యుఐ కేవలం జాయింట్‌ సెక్రెటరి పదవితో సంతృప్తి పడింది.

 

Don't Miss