రాజ్ భవన్ కు చేరుకున్న జేడీఎస్, కాంగ్రెస్..

19:05 - May 16, 2018

కర్ణాటక : కన్నడ రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఏ పార్టీని పిలుస్తారనే సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాజ్‌భవన్‌కు 118 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసేందుకు కుమారస్వామి, సీఎల్పీ నేత పరమేశ్వర చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కుమారస్వామి గవర్నర్‌ను కోరనున్నారు. అవసరమైతే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో గవర్నర్‌ ముందు మార్చ్‌ చేయించే యోచనలో కుమారస్వామి ఉన్నారు. మరోవైపు కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారన్న వార్తలపై పీసీసీ స్పందించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడడం లేదని స్పష్టం చేసింది. 

Don't Miss