కేసీఆర్ వి నిరంకుశ పోకడలు : డీకే అరుణ ఫైర్

17:56 - March 13, 2018

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేసీఆర్, టీసర్కార్ చీకటి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పోకడలను ప్రజలు ఏమాత్రం సహించరని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏమాత్రం సరిగ్గాలేదన్నారు. విపక్షాలను బెదిరించడమే లక్ష్యంగా ప్రభుత్వం తమపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ బెదిరింపులకు తాము బెదరబోమంటున్న డీకే అరుణతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. టీఆర్ ఎస్ ఒంటెత్తు పోకడలకు పోతుందన్నారు. తమ సభ్యులు మైకులు విసిరిన విజువల్స్ చూపిస్తున్నారని పేర్కొన్నారు. మైక్ లు స్వామిగౌడ్ కు తగిలిన విజువల్స్ కూడా చూయించాలన్నారు. ఈ ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని..టీఆర్ ఎస్ దుర్బిద్ధితో పని చేస్తుందని మండిపడ్డారు. పట్టించుకోనప్పుడు సభలో సభ్యులు ఆవేశానికి గురవ్వడం సహజమన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దొరతనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకున్ని సభ నుంచి బయటికి పంపడం దేశంలో ఎక్కడా జరగలేదని.. తెలంగాణలోనే మొదటిసారిగా జరిగిందన్నారు. 

 

Don't Miss