పేదల ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కడ - వంశీచంద్..

13:37 - December 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పలు విమర్శలు గుప్పించారు. పేదల ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కడ ? అని ప్రశ్నించారు. నిమ్స్ ఉంది డబ్బులున్న ధనికుల కోసమా ? పేదల కోసమా ? అని ప్రశ్నించారు. మూడో రోజు సోమవారం శాసనసభ సమావేశాలు కొనసాగాయి. టీ బ్రేక్ అనంతరం ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడారు. కల్వకుర్తిలో మెడికల్ లో 40 పోస్టులు ఉంటే కేవలం 15 శాతం భర్తీ చేశారని...22 ఖాళీలుంటే ముగ్గురు డిప్యూటైషన్ పై ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. తమ హాయాంలో ఏర్పాటైన పీహెచ్ సీలను కనీసం ప్రారంభోత్సవం కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లిలో రూ. 57 లక్షలతో పీహెచ్ సీ..రంగారెడ్డి ఆమన్ గల్, కర్తాన్ మండలం మైసీగండిలో రూ. 57 లక్షలతో ఆసుపత్రి నిర్మించడం జరిగిందని తెలిపారు. రెండు పీహెచ్ సీలను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ వారు తీసుకోవడం లేదన్నారు. తీసుకుంటే వైద్యులు నియమించాల్సి ఉంటుందని, మందులను సరఫరా చేయాల్సి ఉంటుందని కనుకే తీసుకోవడం లేదన్నారు.

Don't Miss