మోడీ మాయలో పడొద్దన్న రాహుల్...

21:06 - February 10, 2018

కర్నాటక : ప్రధానమంత్రి నరేంద్ర మోది తప్పుడు హామీలతో ప్రజలను మభ్య పెడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్‌ ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. మోది మాయలో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ఏదైతో చెబుతుందో అదే చేసి చూపిస్తుందని రాహుల్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగమంతా కాంగ్రెస్‌ను తిట్టడానికే సరిపోయిందని...భవిష్యత్తు గురించి ఏమి చెప్పలేదని ధ్వజమెత్తారు. యువతకు ఉపాధి, రైతులకు మద్దతుపై మోది మాట్లాడలేదన్నారు. . బళ్లారిలో 'డు ఆర్‌ డై' పేరుతో రాహుల్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాఫెల్‌ డీల్‌ ఒప్పందం కాంట్రాక్ట్‌ను మార్చడం ద్వారా మోది ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 

Don't Miss