మాకు అవకాశం ఇవ్వండి...

21:02 - May 17, 2018

ఢిల్లీ : కర్ణాటక గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంతో గోవా, బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు అంశాలను కాంగ్రెస్‌, ఆర్జేడి తెరపైకి తెచ్చాయి. గోవా, బిహార్‌లలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌, ఆర్జేడి డిమాండ్‌ చేశాయి. దీనిపై తాము రేపు గవర్నర్‌ను కలిసి డిమాండ్‌ చేస్తామని ఆర్జేడి నేత తేజస్వి యాదవ్‌ తెలిపారు. 81 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ 17 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం నాలుగు స్థానాల దూరంలో నిలిచింది. 14 స్థానాలు గెలిచిన బిజెపి జిఎఫ్‌పి, ఎంజిపి, ముగ్గురు ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా గవర్నర్ మృదుల సిన్హా కూడా కర్ణాటక గవర్నర్ బాటలోనే నడవాలని గోవా కాంగ్రెస్ చీఫ్‌ చంద్రకాంత్ కవ్లేకర్ అన్నారు. మణిపూర్‌, మేఘాలయలో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Don't Miss