మంచం కింద నాటుబాంబు పెట్టి...

08:09 - February 13, 2018

నల్గొండ : జిల్లాలో మరో హత్య జరగడంతో కలకలం రేగుతోంది. వరుసుగా జరుగుతున్న హత్యలతో జిల్లా ఇప్పటికే అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన హత్యలో రాజకీయ కోణం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...తిరుమల గిరి మండలంలోని నాగార్జునపేట తండాలో మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మా నాయక్ నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి మంచం ధర్మానాయక్ పడుకున్నాడు. మంచం కింద పెట్టిన నాటుబాంబులు పేలడంతో ధర్మానాయక్ శరీరం ఛిద్రం అయిపోయింది. పాతకక్షలే కారణమని తెలుస్తోంది. కుటుంబ వివాదాల మధ్య ఈ హత్య జరిగిందా ? అనేది తెలియాల్సి ఉంది. 

Don't Miss