టీడీపీలో ఏం జరుగుతోంది..? బాబు పట్టించుకోవడం లేదా?!

16:50 - January 12, 2017

అమరావతి :మూడూ వివాదాలు..ఆరు సవాళ్లు...రెండు అక్షింతలు. ఇదీ ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న పరిస్థితి. క్రమశిక్షకు తొలి ప్రాధాన్యం ఇచ్చే టీడీపీలో విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ప్రజాసమస్యలపై స్పందించాల్సిన నేతలు వివాదాలతో పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నారు.. కొందరు నాయకుల తీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదన్న విమర్శలొస్తున్నాయి.. అసలు పార్టీలో ఏంజరుగుతోంది?

పశ్చిమగోదావరి జిల్లాకుచెందిన ఓ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు...

ఏపీ టీడీపీలో నేతల వ్యక్తిగత వివాదాలు పెరిగిపోతున్నాయి... క్రమశిక్షణ తప్పిన కొందరు నాయకులపై ఆరోపణలు వస్తూనేఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లాకుచెందిన ఓ ఎమ్మెల్యే తీరుపై పార్టీలోవిమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ అధికారులతో ఘర్షణపడుతూ టీడీపీకి చెడ్డపేరు తెస్తున్నారన్న చర్చ జిల్లాలో నడుస్తోంది.. ఇక గుడివాడకుచెందిన ఓ నేత ప్రైవేట్‌ ఫంక్షన్‌లో గాల్లోకి కాల్పులుజరిపడం కలకలం సృష్టించింది.. అధికారపార్టీ నేత అయిఉండి ఇలాంటి పనులుచేయడాన్ని స్థానికులకూడా తప్పుబట్టారు..

ఓ మంత్రికీ, జడ్పీ చైర్మన్‌కుమధ్య విభేదాలు.....

ఇక గుంటూరు జిల్లాలో ఓ మంత్రికీ, జడ్పీ చైర్మన్‌కుమధ్య విభేదాలు తారాస్థాయికిచేరాయి.. ఆ తర్వాత ఇద్దరిమధ్యా పార్టీ పెద్దలు రాజీకుదిర్చినా ఈ వివాదం పార్టీకి మచ్చగా మారింది.. తూర్పుగోదావరి జిల్లాకుచెందిన మరో ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్‌పై చేయిచేసుకోవడం వివాదాస్పదమైంది... ఇదికాస్తా డాక్టర్లు విధులు బహిష్కరించేవరకూ వెళ్లింది..

కొందరు టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు...

ఇలాంటి విషయాల్లోనేకాదు.. కొందరు టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలుకూడా తీవ్రస్థాయిలో వస్తున్నాయి.. విశాఖ జిల్లాలో ఓ ఎమ్మెల్యేభూకబ్జాలకు పాల్పడ్డారంటూ కేసుకూడా నమోదైంది.. ఉత్తరాంధ్రకుచెందిన ఓ ఎమ్మెల్సీ ఉద్యోగాలను అమ్ముకుంటూ దొరికిపోయారు.

ఒకప్పుడు చిన్న తప్పు చేసినా వెంటనే స్పందన...

ఇలా పార్టీలో నేతలపై ఆరోపణలు పెరుగుతున్నా వీటిపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఒకప్పుడు చిన్న తప్పు చేసినా వెంటనే స్పందన కనిపించేది.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సుద్దాల దేవయ్యలపై ఆరోపణలు రాగానే వెంటనే మంత్రి పదవులనుంచి తొలగించారు.. ఇప్పుడుమాత్రం సర్వే నివేదికల్ని చూపిస్తూ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న వ్యక్తులకు చొరవ మరింత పెరుగుతోంది.. త్వరలో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని... తప్పుచేసినవారికి శిక్ష తప్పదని పార్టీలోని ముఖ్యనేతలు చెబుతున్నారు..

Don't Miss