రోహిత్ దళితుడు కాదని నిర్ధారణ...

18:57 - February 14, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ వేముల దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ నిర్ధారించింది. రోహిత్ ది వడ్డేర కులమని విచారణ కమిటీ తేల్చింది. గతేడాది జనవరి 17న రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుల వివక్ష, వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో రోహిత్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇదిలావుంటే తాజాగా ప్రభుత్వ కమిటీ ప్రకటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక వేత్తలు మండిపడుతున్నాయి.
కేసులో ఉన్నవారిని కాపాడేందుకు కుట్ర : భాస్కర్  
రోహిత్ కులం మార్చి...ఆ కేసులో  కేసులో ఉన్నవారిని కాపాడేందుకు పన్నాగం పన్నుతున్నారని కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులు కలిసి... రోహిత్ దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ చేత నిర్ధారింప చేశారని ఆరోపించారు. నరేంద్రమోడీ, చంద్రబాబులు ఆర్ ఎస్ ఎస్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీవ్రమైన దళిత ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదని స్పష్టం చేశారు. దళితుల వైపు నిలబడకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోడీ, చంద్రబాబులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇది రాజకీయ దురుద్ధేశపు చర్య : మాల్యాద్రి 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దురుద్ధేశంతో చేస్తున్న చర్యగా ఏపీ కేవీపీఎస్ నేత మాల్యాద్రి అభిర్ణించారు. 
ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా వ్యవహిరించడం సరికాదన్నారు.
దళితులపై వ్యతిరేక క్యాంపెయిన్ : కంచె ఐలయ్య
ప్రభుత్వాలు దళితులపై వ్యతిరేక క్యాంపెయిన్ చేసి.. లబ్ధి పొందాలనుకుంటున్నాయని సామాజికవేత్త కంచె ఐలయ్య అన్నారు. రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని తెలిపారు. ఏపీలోని దళితులు సీరియస్ గా ఆలోచించాలని తెలిపారు. ఎక్కడికక్కడే దళితులను అణచివేస్తామంటే ఎలా కరెక్టు అవుతుందన్నారు.
రోహిత్ దళితుడు కాదనడం సరికాదు : బి.వెంకట్
రోహిత్ వేముల దళితుడు కాదని గుంటూరు కలెక్టర్ నిర్ధారణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గం సభ్యులు బి.వెంకట్ అన్నారు. ఇది ఒక వ్యక్తికి జరిగిన ఘటన కాదని.. సమాజానికి జరిగిన ఘటన అన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. రోహిత్ తల్లి రాధికమ్మ దళిత ..మాల కులానికి చెందిన మహిళ అని చెప్పారు. రోహిత్ గత 20 సం. లుగా తల్లి సంరక్షణలో పెరిగాడు. కుల నిర్ధారణ చేసేటప్పుడు గ్రామ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విషయంలో బిజెపి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కుట్రలో సీఎం కేసీఆర్, సీఎం చంద్రబాబు పాత్రదారులు అన్నారు. వీరిని దోషులుగా చేల్చాలని చెప్పారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దీన్ని ఉద్యమం లాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.
హెచ్ సీయూ విద్యార్థి సంజయ్...
రోహిత్ కేసులో కేంద్రమంత్రి, వీసీ అప్పారావు ముద్దాయిలుగా ఉన్నారు.. వారిపై ఎస్సీ, ఎస్టీ ఎఫ్ ఐఆర్ అయింది.
ఈ కేసు నుంచి వారిని తప్పించేందుకు రోహిత్ దళితుడు కాదని కమిటీ తేల్చిందని చెప్పారు. రోహిత్ కు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  
టీకాంగ్రెస్ నేత మల్లు రవి... 
ప్రభుత్వ కమిటీ వాస్తవ పరిస్థితులను బట్టి నిర్దారించలేదు. పై నుంచి ప్రభుత్వాలు ఆదేశించినట్లు కమిటీ నడుచుకుంది. వేరే కమిటీ చేత నిజ నిర్ధారణ చేయాలి. 

 

Don't Miss