పరిహారం ఇవ్వండి భూములిస్తాం : రైతులు

07:29 - August 31, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జీవనాధరం అయినభూములను నాశనం చేయకుండా ఆపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తోంది. సహజంగా మా భూములు ఇవ్వం అని పలు రకనా పేచీలు పెట్టే గ్రామీణులు.. భూములిస్తాం మొర్రో అంటున్నా..ప్రభుత్వ తీరు మారడం లేదు. మాకు గొడవలు వద్దు.. పరిహారం ఇచ్చి భూములు తీసుకోండి అని మొరపొట్టుకున్నా.. పాలకులు పోలీసులతో బలప్రయోగం చేయస్తున్నారు. దీనిపై వంశధార నిర్వాసితులు భగ్గున మండిపడితున్నారు. అధికారపార్టీ నాయకుల కమీషన్లకోసం పచ్చనిపల్లెల్లో చిచ్చుపెడుతున్నారని వాపోతున్నారు. గత ఇరవై రోజులుగా పోలీసు పహారా నడుమ వంశధార ప్రాజెక్ట్ పనులు జరిపించడంతో పాటు.. నిర్వాసిత గ్రామాల్లో బలగాల మోహరింపు స్థానికుల ఆగ్రహావేశాలకు కారణంగా మారింది.

వినిపించుకోని అధికారులు
శ్రీకాకుళం జిల్లా హిరమండలం దుగ్గుపురం, పాడలి, చిన్నకొల్లివలస, ఇరపాడు, తులగాం గ్రామాలకు చెందిన నిర్వాసిత రైతులు ప్రభత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగువందల ఎకరాలను పంటతో సహా జేసిబి, ట్రాక్టర్లతో నాశనం చేశారని కన్నీరుపెట్టుకుంటున్నారు. పరిహారం ఇస్తే .. భూములు ఖాళీ చేస్తామని చెప్పినా వినిపించుకోవడంలేదని నిర్వాసిత గ్రామాల ప్రజలు అంటున్నారు.

హైకోర్టులో పిల్‌
మరోవైపు పచ్చని పంట పొలాలను ద్వంసం చేయడాన్ని వ్యతరేకిస్తూ హ్యూమన్ రైట్స్ ఫోరం తరపున కే.వీ.జగన్నాథరావు హైకోర్టులో పిల్‌ వేశారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్‌ లో కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వారం రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభభుత్వాన్ని, మరో 7గురు ప్రతివాదులను ఆదేశించిందని జగన్నాథరావు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో అయినా.. రాష్ట్రప్రభుత్వం బలప్రయోగాన్ని మానుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. 

Don't Miss