అల్లర్ల కేసులో అమిత్‌షాకు కోర్టు సమన్లు

22:00 - September 12, 2017

గుజరాత్‌ : గుజరాత్ 2002లో  జ‌రిగిన అల్లర్ల కేసుకు సంబంధించి బిజెపి చీఫ్‌ అమిత్ షాకు సిట్‌ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 18న కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అమిత్‌షాను ఆదేశించింది. అమిత్‌షా సాక్షిగా కోర్టు ముందు హాజ‌రు కావాల‌ని ఈ కేసులో హ‌త్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్‌ మాజీ మంత్రి మాయా కొద్నానీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కొద్నాని విజ్ఞప్తిని ఏప్రిల్‌లో కోర్టు అంగీకరించింది. నరోద గ్రామంలో జరిగిన అల్లర్లలో 11 మంది ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణ 4 వారాల్లోగా పూర్తి చేయాలని సిట్‌ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 2002 అల్లర్లకు సంబంధించి మాయా కొద్నానీ దోషిగా తేలింది. ఆ హ‌త్యలు జ‌రిగిన స‌మ‌యంలో తాను అమిత్ షాతో క‌లిసి త‌న ఆసుప‌త్రిలో ఉన్నట్లు మాయా కొద్నాని  చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి 2009లో మాయా కొద్నానిని అరెస్ట్‌ చేశారు. 

Don't Miss