పరిశ్రమలకు సీపీఎం వ్యతిరేకం కాదు : మధు

16:31 - October 2, 2016

విజయవాడ : పరిశ్రమలకు సిపిఎం వ్యతిరేకం కాదని... నిషేధించబడిన పరిశ్రమల ఏర్పాటును మాత్రమే అడ్డుకుంటోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా నిర్మించే ఆక్వా పరిశ్రమ ఏర్పాటు  ప్రక్రియను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా, రసాయన, తోళ్ల పరిశ్రమల హబ్‌గా రాష్ట్రాన్ని మార్చేందుకు సర్కారు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆక్వా పరిశ్రమ సందర్శన సందర్భంగా భీమవరంలో మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని దౌర్జన్యానకి పాల్పడ్డారని తెలిపారు. భీమవరం పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటు ప్రాంతాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈనెల 4న  పోలీసులు అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా... పెద్ద ఎత్తున సిపిఎం కార్యకర్తలతో తుందుర్రు సందర్శిస్తామని స్పష్టం చేశారు. 

Don't Miss