భార్య కోరిక..'అశ్విన్' కళ్ల దానం...

12:39 - January 9, 2017

భారత ఆఫ్ స్పిన్నర్ 'రవి చంద్రన్ అశ్విన్' తన బౌలింగ్ మాయతో ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెడుతుంటాడు. అంతేగాకుండా భారత్ కు పలు విజయాలు అందించాడు కూడా. మరణానంతరం తన నేత్రాలను దానం చేసేందుకు 'అశ్విన్' ముందుకొచ్చాడు. ఈ మేరకు హమీపత్రం మీద సంతకం కూడా చేశాడు. నేత్ర దానం చేయడం అనేది తన భార్య చిరకాల వాంఛ అని 'అశ్విన్' చెప్పుకొచ్చాడు. ఇటీవలే 'అశ్విన్' తండ్రి అయిన విషయం తెలిసిందే. కళ్లను దానం చేయడం ద్వారా.. అంధులకు చూపును ప్రసాదించవచ్చనే మంచి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్న 'అశ్విన్‌'పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అభిమానులు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరాడు. భవిష్యత్తులో తాను రోడ్డు భద్రతను పెంపొందించేందుకు, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని 'అశ్విన్' ఈ సందర్భంగా వెల్లడించాడు.

Don't Miss