ఫిఫా 2018 పుట్‌బాల్‌... ఫైనల్‌కు చేరిన క్రొయేషియా

07:44 - July 12, 2018

ఢిల్లీ : ఫిఫా 2018 పుట్‌బాల్‌లో అద్భుతమైన ఆటతీరుతో  తన సత్తా చాటింది క్రొయేషియా. 1966 తర్వాత రెండో సారి ఫైనల్‌కు చేరుకోవాలన్న ఇంగ్లాండ్‌ తపనను  క్రొయేషియా నీరుగార్చింది.లుజ్నికీ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో  విజయం సాధించి  ఫైనల్‌కు చేరింది.   అంచనాలు లేకుండా సాగిన పోరులో క్రొయేషియా విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభమైన 5 నిమిషాలకే ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ కీరన్‌ ట్రిప్పర్‌ గోల్‌కొట్టాడు.  ఇక ద్వితీయార్థంలో క్రొయేషియా  ప్లేయర్‌ ఇవాన్‌ పెరిసిక్‌ 68వ నిమిషంలో గోల్‌ కొట్టి జట్టు స్కోర్‌ ఈక్వల్‌ చేశాడు. ఇక మారియో మండ్జుకిక్‌ 109వ నిమిషంలో గోల్‌ చేసి క్రొయేషియాకు విజయాన్ని సాధించాడు. ఆదివారం జరుగనున్న టైటిల్‌ పోరులో ఫ్రాన్స్‌తో క్రొయేషియా తలపడనుంది.

Don't Miss