కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్..

09:18 - July 28, 2018

తమిళనాడు : డీఎంకే అధినేతీ తీవ్ర అస్వస్థతతో కావేరీ ఆసుపత్రిలో జాయిన అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కోలుకుంటున్నారని బైటకు చెబుతున్నా..ఆయన కోలుకోవటం కొంచెం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో కావేరీ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.అరవింద్ సెల్వరాజ్ కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్యం సమస్యలతో పాటు రక్తపోటు డౌన్ అయిపోయిందనీ..దీనికి సంబంధించి చికిత్స కొనసాగుతోందనే ముక్తసరి హెల్త్ బులిటెన్ తో కార్యకర్తలో ఆందోళన మరింతగా పెరిగింది. 94ఏళ్ల రాజకీయ కురువృద్ధుడు..డీఎంకే అధినేత కరుణానిధికి పెద్దసంఖ్యలో అభిమానులున్నారు. ఆయన ఆరోగ్యంపై పన్నీర్ సెల్వం, కమల్ హాసన్ స్టాలిన్ ను కలిసి పరామర్శించారు. అలాగే ప్రధానితో సహా పలువురు రాజకీయ నేతలు స్టాలిన్ కు ఫోన్ చేసి కరుణానిధి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.  

Don't Miss