బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం నాశనమే..

16:20 - November 2, 2018

తమిళనాడు : రాజకీయాలలో శాశ్వత శతృవులు..శాశ్వత మిత్రులు వుండరనేది జగమెరిగిన సత్యం. ఆ మాట అక్షరాలా నిజమైంది. కాంగ్రెస్,టీడీపీ పార్టీలు ఒక్కటయ్యాయి. రానున్న రోజుల్లో దేశ రక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తామని రాహుల్ గాంధీ, సీఎం చంద్రబాబు మీడియా ముఖ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇరుపార్టీల భేటీని కొందరు తీవ్రంగా విమర్శిస్తుంటే మరికొందరు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ స్పందించారు.

Image result for chandrababu rahul gandhiకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల కలయికను తాము స్వాగతిస్తున్నామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని ఇరువురు నేతలు ప్రకటించడం సంతోషకరమని చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని, కీలక వ్యవస్థలు నాశనమవుతున్నాయని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం భ్రష్టుపడుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు అత్యవసరమని అన్నారు. 

Don't Miss