దళిత యువకుడు అదృశ్యం..

18:01 - August 22, 2017

మంచిర్యాల : జిల్లాలో ఓ దళిత యువకుడు అదృశ్యం అయ్యాడు. మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. మందమర్రి మండలం సారంగపల్లికి చెందిన సాగర్‌... 4నెలల కిందట అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు సాగర్‌ కుటుంబ సభ్యులపై దాడిచేశారు. ఇదిలా ఉండగా మూడు రోజులుగా సాగర్‌ కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. అమ్మాయి తల్లిదండ్రులే తమ కుమారుడిని కిడ్నాప్‌ చేశారని సాగర్‌ పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు.
వివాదాలకు దూరంగా దాదాపు రెండు..మూడు నెలలుగా హైదరాబాద్ లో సాగర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంటికి వస్తానని ఫోన్ చేసిన సాగర్ తరువాత అదృశ్యమయ్యాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగ్గా స్పందిస్తలేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Don't Miss