అతివేగం..ఒకే కుటుంబంలో తీరని శోకం..

08:46 - June 6, 2018

జగిత్యాల : అతి వేగం ప్రమాదకరమనీ..అది మీ కుటుంబాలకే కాక పలువురి కుటుంబాలలో విషాదాలను నింపుతుందనీ ఎంతగా చెప్పినా వినని వాహనదారులు వేగంగా నడిపి ప్రాణాలను కోల్పోతున్నారు. అంతేకాదు పలువురి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. అతి వేగంగా వాహనాలను నడిపి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది. గొల్లపల్లి మండలం చిల్లకూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్థానికులు అందించిన సమచారంతో సంఘనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి గల కారాణాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. మృతులు నిన్న అర్థరాత్రి ఓ పుట్టిన రోజు వేడుకకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్ లుగా గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతి ప్రమాదమే కారణంగా స్థానికులు పేర్కొంటున్నారు.

Don't Miss