డబుల్ డెక్కర్ బస్సు బోల్తా..17 మంది మృతి...

19:00 - February 11, 2018

హాంకాంగ్‌ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్‌ డెక్కర్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు రేస్‌ కోర్స్‌ను తిలకించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు... థాయ్‌ పో నుంచి షాటిన్‌ రేస్‌కోర్స్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ బస్సును అతివేగంగా నపడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. బోల్తా పడిన తర్వాత పక్కనే ఉన్న బస్‌ స్టేషన్‌లోకి దూసుకెళ్లింది. సహాయ సిబ్బంది బస్సు టాప్‌ కట్‌చేసి బోల్తా పడ్డ బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. 

Don't Miss