దర్శకుడు మూవీ రివ్వూ

20:09 - August 4, 2017

జీనియస్ డైరక్టర్ సుకుమార్ తన నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ ద్వారా రెండోవ చిత్రంగా తెరకెక్కిన దర్శకుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశోక్, ఈషా రెబ్బా, హీరో హీరోయిన్లుగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ట్రైలర్స్ తోనూ టీజర్స్ తోనూ మంచి హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ...
కథ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుండి దర్శకుడు కావాలని తపన ఉన్న కుర్రాడు మహేష్. ఒక నిర్మాతకు తన కథను చెప్పి సినిమాను ఒకే చేసుకుంటాడు ఆకథలో లవ్ ట్రాక్ తగ్గిందని, లవ్ ట్రాక్ ను ఇంకా బెటర్మెంట్ చేసుకుని 15 రోజుల్లో ఫైనల్ వర్షన్ తీసుకు రమ్మని గడువు విధిస్తాడు  నిర్మాత. దీంతో రెండు రోజులు  తన సొంత ఊరికి వెళ్ళిన మహేష్ కి అక్కడా అనుకోకుండా నమ్రతాతో పరిచయం ఏర్పడుతుంది.. అది కాస్తా ప్రేమకు దారి తీస్తుంది. కాని మహేషం్ మాత్రం తనలో ఉన్న దర్శకుడి వలన ప్రేమను కూడా సినిమా కోణంలోనే చూస్తుంటాడు.. దాంతో హర్ట్ అయిన నమ్రతా. అతనికి దూరం అవుతుంది. అలా ఆమె ప్రేమను కోల్పోయిన మహేష్,తను ప్రాణం పెట్టి డైరక్ట్ చేసిన సినిమాకి కూడా అనుకోకుండా దూరం అవుతాడు.. అలా ప్రేమను, సినిమాను రెండింటిని కోల్పోయిన మహేష్.. 
ఎలాంటి బాధను అనుభవించాడు. అసలు మహేష్ నుండి నమ్రత ఎందుకు దూరం అయ్యింది. తనలోని దర్శకుడికి ప్రేమికుడికి మధ్య సంఘర్షన ఎటువంటిది. చివరికి తన ప్రేమను గెలిచి దర్శకుడిగి మంచి పేరుతెచ్చుకున్నాడా లేదా అనేది తెరపై చూడాలి..
విశ్లేషణ... 
నటీనటుల విషయానికి వస్తే.. డైరక్టర్ విజన్ కు అనుగూణంగా 100 పర్సంట్ ఎఫర్ట్ ను పెట్టి, మెప్పించాడు అశోక్.. సినిమానే జీవితంగా భావించే దర్శకుడి వ్యక్తిత్వాన్ని, ఒక ప్రేమికుడి అనుభవాలను, భాగా పండించాడు అశోక్. 
హీరోయిన్ ఈషా రెబ్బా సహజమైన తన నటనతో ఆడియన్స్ ను కట్టి పడేసింది.. ఈషారెబ్బ కెరీర్ లో ఇదొక మంచి పాత్ర ఆమెకు దక్కింది అని చెప్పొచ్చు.. ఇక సుదర్శన్ తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు అని చెప్పాలి..  ప్రియదర్శి కనిపించిన ఒక్కసన్నివేశంలో అయిన నవ్వలు పూయించాడు.లోబో సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి.. మిగతానటీనటులు అందరూ డైరక్టర్ ఇమాజినేషన్ కి అనుగూణంగా మంచి ఔట్ పుట్ ఇచ్చారు.. 
టెక్నీషియన్స్...     
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. హరిప్రాసద్ జక్కా.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలతోటి మంచి కథను ఎంచుకున్నాడు అని చెప్పాలి.. తాను అనుకున్నదాని అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ప్రజంట్ చేయడానికి బాగానే కష్టపడ్డాడు.. కొన్ని సన్నివేశాలలో నటులచేత సరియైన ఔట్ పుట్ ను రాబట్టుకోవడంలో కొంచె తడబడ్డాడు.. ఇక సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఫ్రేమింగ్ సినిమాకు మంచి రిజ్ లుక్ ను తెచ్చింది.. సాయి కార్తీక్ పాటలు అంత క్యాచీగా లేకపోయినా. మంచి బ్యాగ్రౌండ్ స్కొర్ ను అందించాడు..ఎడిటింగ్ పర్వాలేదు.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే మంచి పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను అలరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ ఆఫ్ లో ఉన్న ఫీల్ సెకండ్ ఆఫ్ లో కూడా కంటీన్యూ చేసి ఉంటే.. సినిమా ఓ రేంజ్ లో ఉండేది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి మరి

 

Don't Miss