మాజీ ప్రధానులు..విపక్షాలపై మోదీ విసుర్లు..

20:45 - December 16, 2016

పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తున్న సందర్భంగా.. అవినీతిని అంతం చేసేందుకు.. నల్లధనాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. విపక్షాలు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. మన్మోహన్‌సింగ్‌, దివంగత ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి మాధవ్‌ గుంగుట్లే రాసిన పుస్తకంలోని వాక్యాలను ఆయన చదివి వినిపించారు. 1971లో నోట్ల రద్దు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ఆలోచించారని మోదీ విమర్శించారు. ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ సహా.. వామపక్షాల నేతలనూ ఆయన తన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. వామపక్షాలపైనా ఆక్రోశం వెళ్లగక్కారు. గతంలో వామపక్ష నేతలు చేసిన ప్రసంగాలను చదివి వినిపిస్తూ... వామపక్షాలు నోట్లరద్దును రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ అంశంపై టెన్ టీవీ చర్చ నిర్వహించింది. ఈ చర్చలో బాబూరావు (సీపీఎం నేత) పుష్పలీల (మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత) ఇందిర (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. వక్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను క్లిక్ చేయండి..

Don't Miss