కొత్త భూసేకరణ చట్టం..విమర్శలు..

20:50 - December 28, 2016

ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ పై.. ప్రతిపక్షాలు, హైకోర్టు నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర భూసేకరణ చట్టం-2013కు అనుగుణంగా... గుజరాత్ తరహలో కొత్త చట్టం తీసుకు రాబోతోంది. ఇప్పటికే భూ సేకరణ ముసాయిదా బిల్లు తయారీకి అధికారులతో కమిటీ వేస్తూ కేసీఆర్ సర్కార్ సెప్టెంబర్ 12 న ఉత్తర్వులు జారీ చేసింది. 2013 భారత భూ పరిహర చట్టం కు అనుగుంగా కమిటీ ముసాయిదా బిల్లును తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ చట్టం ఆధారంగా తెలంగాణ ప్రత్యేక భూ సేకరణ చట్టం ఉంటుందని సమాచారం. కాగా భూసేకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదం పలికింది. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 2013 భూసేకరణ చట్టం కంటే ఇప్పుడు సవరణ చేస్తూ రాబోతున్న చట్టం మెరుగైందేనా? ఈ చట్టం ద్వారా నిర్వాశితులకు మేలు జరుగుతుందా? విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కావాలనే నిర్వాశితులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయా? అడ్డుకుంటున్నాయా? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టాయి. ఈ చర్చలో సారంపల్లి మల్లారెడ్డి ( జాతీయ కిసాన్ సంఘం అధ్యక్షులు, సీపీఎం నేత) ఇందిరా శోభన్ (టీ.కాంగ్రెస్ నేత),తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత),శ్రీధర్ రెడ్డి (బీజేపీ నేత) పాల్గొన్నారు. 2019లో టీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో సీపీఎం అసాంఘిక శక్తులు కనిపించలేదా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం దాటితే గుర్తుపట్టని పార్టీ నేత సీఎం పదవిలో వుండి..చట్టసభలో జాతీయ పార్టీ అయిన సీపీఎంను విమర్శించటమా? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Don't Miss