20న దేశ వ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ సమ్మె

06:47 - January 9, 2017

హైదరాబాద్ : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రాబోతోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు చేస్తున్నారు. విభిన్నవర్గాలు తమ కోరికలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 20న స్కీమ్ వర్కర్లు ఒక్క రోజు దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తమవుతున్నారు. ఈ సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నట్టు అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్స్ ప్రకటించాయి. ఈ నెల 20 స్కీమ్ వర్కర్లు సమ్మె చేపట్టడానికి కారణం ఏమిటి? ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? అంగన్ వాడీ కేంద్రాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలేమిటి? అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధికి రాబోయే కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు చేయాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నేత సుబ్బరామమ్మ విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు. వారు ఏఏ అంశాలపై చర్చించాలో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

Don't Miss