మరో రైతు బలవన్మరణం..

16:11 - October 6, 2017

నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉంటున్నారని..వారి కోసం ఎంతో చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో తమ సమస్యలు తీర్చాలంటూ రైతులు ఆందోళనలు..నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తీవ్ర నష్టాలపాలైన రైతన్నలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరోక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
జిల్లా చిన కాపర్తిలో కౌలు రైతు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. చిట్యాల మండలం చినకాపర్తికి చెందిన రుద్రవరపు ఇస్తారి..3 ఎకరాల్లో పత్తిసాగు చేశాడు. పత్తి దిగుబడి రాకపోవడం..అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పొలంలో పురుగుల మందు సేవించి బలవన్మరణం చేసుకున్నాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Don't Miss