'కేన్స్' మెరిసింది...

11:03 - May 18, 2017

ఫ్రాన్స్ : ప్రతిష్టాత్మక 70వ కేన్స్ చలన చిత్రోత్సవ సందడి షురూ అయ్యింది. తొలి రోజు బాలీవుడ్ 'మస్తానీ' దీపిక పదుకొనె ర్యాంప్ వ్యాక్ చేసింది. పర్పుల్ రంగు మార్చెసా గౌన్ లో దీపిక ఆకట్టుకొంది. 2017 కేన్స్ ఉత్సవంలో తొలి రోజు ర్యాంప్ వాక్ చేసిన భారతీయ నటి దీపి కావడం విశేషం. బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బుధవారం రాత్రి కేన్స్ కు బయలుదేరారు. 2002లో ఆమె నటించిన 'దేవ్ దాస్' సినిమాను ప్రదర్శించబోతున్నారు. 15 ఏళ్లుగా కేన్స్ ఉత్సవాలకు ఆమె హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యతో పాటు సోనమ్ కపూర్, కత్రినా కైఫ్ లు కూడా పాల్గొననున్నారు. బాలీవుడ్ హాట్ నటి మల్లికా శెరావత్ కూడా పాల్గొననుంది. ఈ వేడుకకు దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ నుండి శృతి హాసన్ హాజరు కానుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన 'సంఘమిత్ర' ఫస్ట్ లుక్ ను కేన్స్ లో విడుదల చేయనున్నారు.

Don't Miss