కలత నిద్ర..చేటు..

13:57 - August 30, 2017

ఏమో సరిగ్గా నిద్ర పట్టడం లేదు..అంతా నలతగా ఉంది..సరిగ్గా నిద్ర పోక వారం అయ్యింది. అంటూ కొంతమంది తోటి వారితో అంటుంటారు. మహిళలు ఎక్కువగా కలత నిద్ర పోతుంటారు. కారణాలు ఎన్నున్నా..పరిష్కారాలు మాత్రం మన చేతుల్లో ఉన్నాయంటారు నిపుణులు...గృహిణిలు..ఇంట్లో..ఆఫీసు..బయటి వ్యవహారాలు చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతుంటారు. సమయం దొరికిన సమయంలో అలా నిద్ర పోదామని అనుకున్నా వారికి సరియైన నిద్ర పట్టదు.

నిద్ర పట్టడం లేదు..టీవీ..లేదా మొబైల్..కంప్యూటర్ చూస్తే నిద్ర పడుతుందని భావిస్తూ గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటారు. ఈ మాయలో పడిపోతే పడుకొనే సమయం మారిపోతుంది.

పడుకొనే గదిలో వెలుతురు తక్కువగా ఉండే విధంగా చూసుకోండి. గదిని సాధ్యమైనంత వరకు చల్లగా ఉండాలి. బెడ్ రూంలో టీవీ ఉండకూడదు. కండరాల నొప్పి ఉన్న వారు రాత్రి పడుకొనే ముందు గోరెవెచ్చని నీటితో స్నానం చేయండి.

దిండ్ల కింద ఎలాంటి వస్తువులు..ఇతరత్రా ఉంచకండి. తలగడ లేకుండా పడుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని వైద్యులు పేర్కొంటుంటారు.

కలత నిద్ర వస్తే దుప్పట్లు..దిండ్లు పడుకొనే దిశ మార్చి ట్రై చేయండి.

రాత్రి భోజనంలో క్యాల్షియం, కార్పొహైడ్రేట్లు, ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

Don't Miss